home page sliderNational

టెర్రరిస్ట్ ఇంట్లో పేలుడు.. భద్రతా బలగాలపై తప్పిన ప్రమాదం

పహెల్గాం దాడిలో నిందితులుగా ఉన్న ఉగ్రవాదుల నివాసాల్లో భద్రతా దళాలు తఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే దక్షిణ కశ్మీర్లోని త్రాల్ కు చెందిన ఆసిఫ్ షేక్ ఇంటికి వెళ్లగా, అక్కడ పేలుడు పదార్థాలు ఉన్నాయని గుర్తించారు. అవి యాక్టివేట్ అయినట్లు తెలియడం వల్ల అప్రమత్తమైన భద్రతా బలగాలు బయటకు వచ్చేశాయి. కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో ఆర్మీ జవాన్లకు హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇళ్లల్లో పేలుడు పదార్థాలు అమర్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.