Andhra PradeshHome Page SliderNewsPolitics

మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో రిలీఫ్‌

పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ ఆరోపణల కేసులో ఏపీ మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై చిత్తూరు సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ విచారించి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సెషన్స్‌ కోర్టును ఉన్నత న్యాయ స్థానం ఆదేశించింది. నారాయణకు చిత్తూరు మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను గత నెల 30న సెషన్స్‌ కోర్టు రద్దు చేసింది. కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను మాజీ మంత్రి నారాయణ సవాల్‌ చేయగా… సెషన్స్‌ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.

తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని క్వాష్‌ పిటిషన్‌లో కోరారు. చిత్తూరు కోర్టు ఇచ్చిన అరెస్ట్‌ రద్దు ఆదేశాలను పక్కన పెట్టింది. ప్రభుత్వం హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ వేసింది. విచారణ సందర్భంగా నారాయణ తరఫు న్యాయవాది రివిజన్‌ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని తేల్చారు. కేసు పూర్వాపరాల ఆధారంగా తిరిగి విచారణ జరపాలని చిత్తూరు సెషన్స్‌ కోర్టును ఆదేశించింది.