ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్న జనగాం జనం
ఆర్ధికంగా వెనుకబడి ఉన్న దళితుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభించిన.. పథకం ఇప్పటి వరకు గ్రౌండ్ లెవల్లో నేటికీ ఇంప్లిమెంట్ కాలేదు. దళితులకి చేయూతనిస్తూ… ఎస్సీ కుటుంబానికి ఒక్కరికి రూ.10 లక్షల విలువైన యూనిట్లను అందజేసి.. వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. ట్రాక్టర్లు , కార్లు , పౌల్ట్రీ ఫామ్ వంటి యూనిట్లను మంజూరు చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ దళిత బంధు పథకంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌కు ఓటేసే వారికి మాత్రమే దళిత బంధు ఇస్తామని.. ఇందులో ఇలాంటి దాపరికం లేదని స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో సర్వసభ్య సమావేశంలో యాదగిరి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు నీళ్లు లేకుంటే… ఇప్పుడు నీళ్లొస్తున్నాయన్నారు. కరెంటు కూడా రాకున్నా… కరెంట్ ఇస్తున్నామన్నారు. ఎదిగిన ఆడబిడ్డల పెళ్లిళ్లకు సర్కారు పైసలిస్తోంది. గర్భిణీలకు రూపాయి ఖర్చు లేకుండా ప్రసూతి చేస్తున్నామన్నారు. ఉల్టా పైసలు కూడా ఇస్తున్నాం కదా. ఇవన్నీ నష్టమా, లాభమా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఓటేస్తే…. అనేటోళ్ల పేర్లు మాత్రమే దళితబంధులో పెడతామన్నారు. ఓపెన్ సీక్రెట్ అని… దాపరికం ఏమీ లేదన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. టీఆర్ఎస్‌కు ఓటేయకుంటే పథకం ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు దళితబిడ్డలు. పథకమంటే… అర్హులందరికీ ఇవ్వాలని… కొందరికే ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.