NationalNews

అగ్ని ప్రమాద బాధితులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాదం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ఇస్తామని ట్విటర్‌ ద్వారా తెలిపారు. రూబీ లాడ్జి అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్షతగాత్రులకు అపోలో, యశోద, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స జరుగుతోంది. లాడ్జి ఓనర్‌ రంజిస్‌ సింగ్‌ బగ్గాను అదుపులోకి తీసుకున్న గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.