కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెస్తాయా!
★సోషల్ ఇంజినీరింగ్‌లో కేసీఆర్ విఫలం
★తెలంగాణతో పాటు ఆంధ్ర ముందస్తుకు వెళుతుందా…
★ బీసీ ,దళిత సామాజిక వర్గాలకు పెద్ద ఎత్తున అన్యాయం
★ ఈటల మీద వాడిన దళిత బంధు ఏమైంది?
★ రాష్ట్రపతి ఎన్నికల పంచాయతీ ఎన్నికల?
ఎంతో అట్టహాసంగా సుమారు 20 సంవత్సరాలు తరువాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశలు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. జాతీయ నాయకత్వం మొత్తం రెండు రోజులు భాగ్యనగరంలోనే ఉంటున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ దేశ వ్యాప్తంగా ఏ విధమైన కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు వెళ్ళాలి అనే సుదీర్ఘమైన కసరత్తు చేసి ..పార్టీ విస్తరణ లో ఉన్న సవాళ్లు ను ఏ విధంగా ఎదుర్కోవాలి …పార్టీ స్థాపన నుంచి దక్షిణాది న పార్టీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం మీద ప్రధాన దృష్టి సారించబోతున్నారు అనేది సమాచారం. ఎంతో అట్టహాసంగా సుమారు 20 సంవత్సరాలు తరువాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశలు తెలంగాణ లో ప్రారంభమయ్యాయి ..జాతీయ నాయకత్వం మొత్తం రెండు రోజులు భాగ్యనగరం లోనే గడపనున్నారు.. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ దేశ వ్యాప్తంగా ఏ విధమైన కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు వెళ్ళాలి అనే సుదీర్ఘమైన కసరత్తు చేసి ..పార్టీ విస్తరణ లో ఉన్న సవాళ్లు ను ఏ విధంగా ఎదుర్కోవాలి …పార్టీ స్థాపన నుంచి దక్షిణాదిన పార్టీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం మీద ప్రధాన దృష్టి సారించబోతున్నారు అనేది సమాచారం …
దక్షిణాదిన పార్టీని విస్తరించడంలో భాగంగా తెలంగాణను ఒక ప్రయోగంగా తీసుకొని పార్టీ శక్తి నంతటిని ప్రయోగించబోతునట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు… తెలంగాణ బాగోగులు వదిలేసి…జాతీయ స్థాయి నేత అంటూ చేస్తున్న హంగామా అన్నింటినీ దేశమంతా గమనిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడాల్సిన వ్యక్తి అహంకారంతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం యావత్ తెలంగాణ సమాజం చూస్తోంది. తెలంగాణ ఉద్యమం జరిగింది ప్రధానంగా” నీళ్లు నిధులు నియమకాలు” కానీ తెలంగాణాలో ఏ ప్రాంతంలో వెళ్లిన ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది… ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి నడిచిన ఉద్యమ నేతలను ఎవరిని అధికారంలో భాగస్వామ్యం కాకుండా జాగ్రత్త పడ్డారు కేసీఆర్. ఉద్యమ నేతలు అందరూ నిపురు గప్పిన నిప్పులా సమయం కోసం వేచి చూస్తున్నారు….
ఇక రాష్ట్రంలో కేసీఆర్ కు బలమైన ప్రతిపక్ష ముగా ..కేసీఆర్ కు లాలూచీ పడకుండా పోరాడే శక్తి.. ఒక బీజేపీ మాత్రమే ప్రజలకు కన్పిస్తోంది. కాంగ్రెస్ ..మిగతా ప్రతిపక్షలు పైకీ కేసీఆర్ మీద మేకపోతూ గంభీర్యం ప్రదర్శిస్తున్నా… లోలోపల లోపాయకారి ఒప్పందం ఉందన్నది బహిరంగ రహస్యం. కాంగ్రెస్, కేసీఆర్‌తో అంటగట్టుకొనే ఉంది అనే సందేశం రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్‌లోని ప్రజాబలం కలిగిన నేతలు అంతా బీజేపీలోకి వలస వెళ్లడం ..కాంగ్రెస్ లో బలమైన నాయకులు కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి ఉద్దoడులు బీజేపీలోకి రావడాన్నిబట్టి అంచనా వేయొచ్చు. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచి ..ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంత వరకు కేసీఆర్ గాని అతని కుటుంబం సభ్యులు గాని వెళ్లిన పాపాన పోలేదు అంటే విద్యార్థులలో ..ఎంతటి వ్యతిరేకత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు…
జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలను ఒక పంచాయతీ ఎన్నికలు మాదిరిగా మార్చేశారు కేసీఆర్… రాష్ట్ర పరపతిని దిగజార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది.. దేశంలో రాష్ట్రపతి ఎన్నికలకు ఇలా ప్లెక్సీలు కట్టి ప్రచారం చేసిన ఘనత ఒక కేసీఆర్‌కే చెల్లుతుంది. ఒక గిరిజన అభ్యర్థిని మహిళా ను దేశంలో అత్యున్నత స్థానానికి చేరుకొనే అవకాశం వస్తే రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలుపాల్సిన ముఖ్యమంత్రి చవకబరు రాజకీయాలు చేసి మేధావి వర్గాలలో తన అజ్ఞానాన్ని బయట పెట్టుకొని స్థాయిని దిగజార్చుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. సంక్షేమపథకాలు పట్ల కూడా రాష్ట్ర ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ప్రతి పథకాన్ని పక్క రాష్ట్రలతో పోల్చుకుంటున్నారు ..ఆంద్రప్రదేశ్ లోటు బడ్జెట్ తో ప్రారంభ ఆయన కూడా తెలంగాణ రాష్ట్రం కన్నా అధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది …సుసంపన్నమైన రాష్ట్ర సంపద ఎనిమిదేళ్లలో ఏమైంది? సంపద ఇలా ప్రజలకు చేరలేదు ..అలా అని అభివృద్ధి లో పెట్టుబడులు పెట్టలేదు. మరి రాష్ట్ర ఖజానా లక్ష కోట్ల రుణానికి వెళ్లి లోటు బడ్జెట్లోకి ఎందుకు వెళ్ళిoదో రాష్ట్ర ప్రజానీకం ఆలోచిస్తున్నారు… ఇక తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే దళితులే మొదటి ముఖ్యమంత్రి అన్న కథ కంచికి చేరింది. రాష్ట్ర క్యాబినెట్ లో దళితులకు ..గిరిజనులకు సరైన అధికార వాటా దొరకలేదు.. అధికారం మొత్తం తన తనయుడు కేటీఆర్ ఆధ్వర్యంలో నే ఉంది ..ప్రభుత్వం ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది… “నీ కాళ్ళు మొక్కుతా బాంచన్ దొర అన్నట్లు పాలన కొనసాగుతుంది. గిరిజనులకు 12%రిజర్వేషన్లు ఇస్తానన్న ముఖ్యమంత్రి… కనీసం గిరిజన అభ్యర్థిని రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు తెలిపి వారి ఆదరణ ను పొందే ప్రయత్నం చేయక ..పొడు భూములనే ప్రధాన జీవనాధారంగా జీవించే గిరిజన మహిళ రైతులను బేడీలు వేసి రోడ్డు మీద నడిపించిన ఘనత మన కేసీఆర్‌కే చెల్లింది ….
రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతృప్తి స్థాయిలో ఉన్నట్లు కనబడటం లేదు …హైదరాబాద్‌లో సంపన్న కుటుంబాలు ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి కనబడుతోంది గాని మిగతా 75%ప్రాంతాల్లో అసలు ఇది రాజధాని నగరమేన అన్నట్లు ఉంది పరిస్థితి.. దానికి పర్యవసానమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 కార్పొరేట్ సీట్లను బీజేపీ గెలవడం చిన్న విషయం కాదు… ప్రజల్లో ఉన్న రిఫ్లెక్షన్‌ను ఎన్నికలు రుజువు చేశాయ్. బీజేపీ సాధించిన కార్పొరేట్ స్థానాలను బట్టి అంచనా వేసినా… 12 సీట్లను సునసాయంగా గెలిచే అవకాశం ఉంది. ఇక మజ్లిస్ 7 స్థానాలు గెలిస్తే ..ఇక టీఆర్ఎస్ 6 స్థానాలకు పరిమితము కావచ్చు. ఒక హైదరాబాద్ లోని మాత్రమే అంచనా ఇది ..ఇక ప్రతి రోజు హైదరాబాద్ ను ప్రపంచ నగరం చేస్తున్నాను అనే కేటీఆర్… మరి హైదరాబాద్ లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు.. ఇక సోషల్ ఇంజినీరింగ్ లో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని చెప్పొచ్చు… ఉద్యమ కాలంలో బలమైన నేత.. బీసీ వర్గాల గొంతుకుగా ఉన్న ఈటల రాజేందర్ ను పార్టీ లో జరిగిన అవమానం అంతా ఇంతా కాదనే చెప్పాలి.. బలమైన నాయకుడిని …బలమైన సామాజిక వర్గాన్ని పోగుట్టుకున్నారు…రాజేందర్‌ని ఎన్నికల్లో తట్టుకోవడానికి అట్టహాసంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం కూడా కేసీఆర్ మీద ఉన్న అసంతృప్తి ని నిలువరించలేఖపోయేది.. తరువాత దళిత బంధు పథకం. అటకెక్కింది…
కానీ బీజేపీ గ్రామ స్థాయిలో దళితులకు ఆకట్టుకునే పనిలో పడింది… గ్రామ స్థాయి లో జాతీయ స్థాయి నాయకుల ను పోలింగ్ బూత్ స్థాయి లో మోహరింపచేసింది… జవదేకర్, సాధ్వి ప్రజ్ఞా, రాజ్యవర్థన్ రాథోడ్ లాంటి దేశవ్యాప్తంగా జనం గుర్తించగలిగిన నాయకులు తెలంగాణలో రాజకీయ వ్యూహాల్లో మునిగితేలుతూ ఉన్నారు. 119 మంది నాయకులు మొత్తం 119 నియోజకవర్గాల్లోని దళితుల ఇళ్లలో బస చేస్తూ బూత్‌ల వారీ రివ్యూ చేస్తున్నారు. మరి వారి సందేశాన్ని జాతీయ నాయకత్వానికి తీసుకొని వెళ్లే స్థాయీలో బీజేపీ పనిచేస్తుందా? సోషల్ ఇంజినీరింగ్ లో బీజేపీ పాత విధానాలను మార్చి ప్రాంతీయ ఆకాoక్షలకు తగినట్లు గా తన విధానాన్ని మార్చుకుంటుందా? తెలంగాణలో బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం ఇప్పటికే స్పష్టంగా ఉంది. అది బీసీలను కేంద్రకంగా చేసుకుని అదనంగా దళితులను, రెడ్లను సమీకరించే పనిలో ఉంది. పార్టీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ మున్నూరు కాపు. మరో మున్నూరుకాపు నాయకుడు లక్ష్మణ్‌ను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించింది బీజేపీ. కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు…..
ప్రచారం లో కూడా బీజేపీ ముందు స్థానంలో ఉంది… బీజేపీ ప్రారంభించిన “సాలు దొర సెలవు దొర ” ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక సరికొత్త ట్రెండ్ ను సృష్టించినది… ఇక కేసీఆర్ మాత్రం రాష్ట్ర రాజకీయ లు వదిలేసి కాంగ్రెసు తో చెట్టాపట్టాలేసుకుని తీరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం… రాష్ట్ర రాజకీయ లు ,ప్రజలు..వారి బాధలు వదిలేసి …దేశ రాజకీయ లు చుట్టూ తిరుగుతున్నారు… ఆ ప్రభవం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది…కేసీఆర్ మూఢనమ్మకాలను నమ్మే వ్యక్తి అని ..అందుకే కనీసం సచివాలయంలో కి కూడా అడుగు పెట్టకుండా పరిపాలన కొనసాగిస్తున్నట్లుగా బీజేపీ ప్రచారం చేస్తోంది… దొర అనే పదాన్ని వాడి కేసీఆర్ మరియు వారి కుటుంబ సభ్యులకు ఇర్రిట్ ట్ చేసే పనిలో సఫలం చెందింది…
ఇక 2018 లో ఒక ఎమ్మెల్యేనే గెలిచిన బీజేపీ, పార్లమెంట్ ఎన్నికలు వచ్చేనాటికి పూర్తి స్థాయిలో మార్పు కనబడింది. 4 ఎంపీ స్థానాలు గెలిచి రాష్ట్ర ప్రజానీకానికి అచ్చర్యంలో ముంచెత్తింది. శ్రీ కృష్ణ కమిటీ చెప్పిన 2లక్షల ఉద్యోగాలు…. ఊసే లేకుండా చేసి హడావుడి గా ఒక 50 వేల ఉద్యోగలా నోటిఫికేషన్ కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకతను చల్లార్చేలాలేవు. ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి, ఆర్టీసీ ఉద్యోగుల అసంతృప్తి, ప్రభుత్వ వైద్యుల సమ్మె కొనసాగుతున్నాయ్. ఏ వర్గం కూడా సంతృప్తి గా ఉన్న దాఖలాలు కనపడటం లేదు… మరి ఇంతటి వ్యతిరేకతను కూడగొట్టుకున్న కేసీఆర్ మళ్ళీ ముందస్తు ఎన్నికల కు వెళ్లే అవకాశం మెండుగా ఉంది… రాష్ట్రపతి ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయంలో వేగంగా మార్పులు చూడొచ్చు. క్యాబినెట్ ప్రక్షాళనా ఉండచ్చు. ఆపరేషన్ తెలంగాణ మీద దృష్టి పెట్టిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారం వైపు అడుగులు వేయడం ఖాయంగా అనిపిస్తుంది… ఇక సాలు దొర అని కేసీఆర్‌కు సెలవు ఇస్తారో లేదో చూడాల.
Dr G అజ్మతుల్లా ఖాన్
రాజకీయ విశ్లేషకులు