భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణస్వీకారం
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్ ఎరిక్ గార్సెట్టితో భారత్లో అమెరికా రాయబారిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కాలిఫోర్నియాకు చెందిన ఎరిక్ గార్సెట్టితో భారతదేశంలో మా తదుపరి రాయబారిగా ప్రమాణం చేసిన ఘనత నాకు దక్కిందని ఆమె చెప్పారు. అంబాసిడర్ గార్సెట్టి నిబద్ధత కలిగిన ప్రజా సేవకుడని… భారతదేశ ప్రజలతో, అమెరికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఈ నెల ప్రారంభంలో, US సెనేట్ Mr గార్సెట్టి నామినేషన్ను ధృవీకరించింది. కీలక దౌత్యవేత్త నియామకం అమెరికాలో రెండేళ్లు పట్టడం విచిత్రాల్లోకెల్ల విచిత్రంగా చూడాల్సి ఉంది. నియామకం గురించి గార్సెట్టిని ప్రశ్నించగా.. సేవ చేయడానికి ఇంకెంత మాత్రం తాను వేచి ఉండలేనన్నాడు గార్సెట్టి. ఈ వేడుకకు భార్య అమీ వేక్ల్యాండ్తోపాటుగా సన్నిహిత కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

