ఇండియా-పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ వద్దు…
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ను భారత్-పాకిస్థాన్‌ల మధ్య చూడాలని లేదన్నారు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్. భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరగకుండా పార్టీని చెడగొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని జోస్ బట్లర్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం అడిలైడ్ ఓవల్ వేదికగా జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్‌లో టీమిండియాతో తలపడనుంది. ఈ గేమ్‌లో విజేత పాకిస్థాన్ మరియు న్యూజిలాండ్ మధ్య జరిగే 1వ సెమీ-ఫైనల్ విజేతతో తలపడతుంది. భారత్‌తో మ్యాచ్‌కు ముందు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన జట్టు సన్నాహాల గురించి మీడియాతో మాట్లాడాడు. కచ్చితంగా భారత్ – పాకిస్తాన్ ఫైనల్‌ను చూడాలని కోరుకోవడం లేదని… కాబట్టి అది జరగకుండా చూసుకోవడానికి మేము చేయగలిగినదంతా చేస్తామన్నారు బట్లర్.

ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో మూడు అర్ధ సెంచరీలు నమోదు చేయడంతో మంచి ఫామ్‌లో ఉన్నాడన్నారు. చూడటానికి సూర్యకుమార్ యాదవ్ చాలా అద్భుతంగా ఉన్నాడని… ఇప్పటివరకు టోర్నమెంట్‌లో బ్యాటర్‌గా నిలిచాడన్నాడు. అతని అతిపెద్ద బలం స్వేచ్ఛగా క్రికెట్ ఆడటమేనన్నారు. స్పష్టంగా అన్ని షాట్‌లను సాధించగలడన్నాడు. ఐతే… ప్రపంచంలోని ఏ బ్యాటర్‌కైనా, వికెట్‌ను పడగొట్టడానికి కేవలం ఒక అవకాశం మాత్రమే ఉంటుందని.. అదేంటో వెదకాలన్నాడు.

ప్రపంచ కప్‌లో యుజ్వేంద్ర చాహల్ ఏ ఆటలోనూ ఆడకపోవడం ఆశ్చర్యంగా ఉందా అని అడిగినప్పుడు, బట్లర్ ఇలా అన్నాడు: యుజీ ఒక గొప్ప బౌలర్, IPLలో అతనితో ఆడటం నేను నిజంగా ఆనందించానన్నాడు బట్లర్. చాహల్ గొప్ప బౌలర్ అని, వికెట్లు తీయడానికి చాలా ఆసక్తి చూపిస్తాడన్నాడు. మలన్, వుడ్‌లకు గాయాల గురించి బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరూ కూడా మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమవుతారని… మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. ఇక భువేశ్వర్ కుమార్ బౌలింగ్ గురించి బట్లర్ హాట్ కామెంట్స్ చేశారు. సొంత ఆటపై నేను ఎప్పుడూ నమ్మకంగా ఉంటానన్నాడు. బౌలర్లకు భయపడబోనన్నాడు.

