ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే?
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోతున్నాయని ప్రతిష్టాత్మక ఆరా సర్వే సంస్థ తేల్చిచెప్పింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గిపోతుంటే… బీజేపీ గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోందని సర్వే ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందని సర్వే తేల్చేసింది. ఐతే ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే టీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టే అవకాశముందని.. సర్వే సంస్థ అధినేత ఆరా మస్తాన్ చెప్పారు. టీఆర్ఎస్‌కు 38.88% ఓట్లతో మెదటి స్ధానంలో ఉంటుందని, బీజేపీ 30.48% ఓట్లతో రెండో స్థానంలో ఉంటుందని ఇక కాంగ్రెస్‌కు 23.71% ఓట్లు, స్వతంతులు, ఇతరులకు 6.93% ఓట్లు వస్తాయని సర్వేలో తేలిందని సంస్ధ లెక్కగట్టింది. నవంబర్ 2021, మార్చి,జూలై 2022 లో మూడు దశల్లో చేసిన సర్వేలో బీజేపీ రోజు రోజుకు బలోపేతం అవుతోందని పేర్కొంది.
ఆదిలాబాద్, నిజామబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో బీజేపీ,టీఆర్ఎస్ మధ్య ప్రముఖ పోటి ఉంటుందన్నారు మస్తాన్. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండలో పోటీ కాంగ్రెస్,టీఆర్ఎస్ మధ్య ఉంటుందన్నారు. ఇక మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పారు. 2019 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడం….గతం కంటే తక్కువ ఓట్లు సాధించడంతో టీఆర్ఎస్ పార్టీని… బీజేపీ మాత్రమే నిలువరించగలదన్న అభిప్రాయాన్ని సర్వే తేల్చింది. దేశ వాప్తంగా భారతీయ జనతా పార్టీ వరుస విజయాలు,మోదీ నాయకత్వం, తెలంగాణలో దుబ్బాక,జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలతో టీఆర్ఎస్ ఓడించే సత్తా బీజేపీకి ఉందని ఆరా సంస్థ స్పష్టం చేసింది.