బలపరీక్షలో షిండే విజయం
మహారాష్ట్ర అసెంబ్లీ బలపరీక్షలో సీఎం ఎక్ నాథ్ షిండే విజయం సాధించారు. షిండే అసెంబ్లీలో బలం నిరూపించుకున్నారు. రెండు వారాల మహారాష్ట్ర రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. విశ్వాస పరీక్షలో ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే విప్ కు వ్యతిరేకంగా ఓటేశారు. విప్ ధిక్కారం కింద ఆదిత్య థాక్రే పై అనర్హత వేటు పడే అవకాశం కన్పిస్తోంది. కాంగ్రెస్ కీలక నేతలు ఎవరూ కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు. ఇవాళ ఉదయం సంతోష్ బంగార్, షిండే గ్రూపులో చేరడంతో… శివసేన రెబల్ గ్రూపులో ప్రస్తుతం 40 మంది ఎమ్మెల్యేలున్నారు.