అల్లూరి నమో నమః
ఆజాదీ అమృతోత్సవాల్లో భాగంగా ఇవాళ అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను ప్రధాని మోదీ ఘనంగా ప్రారంభిస్తారు. 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. భీమవరంలోని పెద అమిరంలో ఇవాళ భారీ బహిరంగ సభ సైతం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. వారితోపాటు మరో ఏడుగురికి మాత్రమే వేదికపై ఆహ్వానం ఉంది. కార్యక్రమంలో అల్లూరి కుటుంబీకులను ప్రత్యేకంగా స్మరించుకోనున్నారు.