“బీఆర్ఎస్ తీరు వల్లే కేంద్ర బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా రాలేదు”:సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మరోసారి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత పాలనలో పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కాగా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తికాకపోవడానికి కారణం బీఆర్ఎస్సే అని సీఎం పేర్కొన్నారు. చేవెళ్ల-పాలమూరు ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.కాగా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. గొర్రెల పథకంలో రూ.700కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాహా చేసిందన్నారు.తెలంగాణాలో పంచే బతుకమ్మ చీరల పంపకంలో కూడా దోపిడి జరిగిందని సీఎం ఆరోపించారు. మరోవైపు కాళేశ్వరంలోను భారీగా అవినీతి జరిగిందన్నారు. కేసీఆర్ సర్కార్ రంగారెడ్డిలో వేలకోట్ల భూములు అమ్మేసిందన్నారు.కాగా బీఆర్ఎస్ ఆలోచన మారలేదు..వారి విధానం కూడా మారలేదని సీఎం ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ తీరు వల్లే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా రాలేదని సీఎం విమర్శించారు.

