‘స్మృతి ఇరానీని ఏమీ అనొద్దు’ -రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ బీజేపీ నేత స్మృతి ఇరానీకి మద్దతుగా నిలవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పార్లమెంట్ ఎన్నికలలో స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీ నేత కిషోరీ లాల్ శర్మ చేతిలో అమేథీ నుండి పరాజయం పాలయ్యింది. దీనితో కొందరు ఆమెను ఎద్దేవా చేస్తూ కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ ట్వీట్ చేస్తూ ‘జీవితంలో గెలుపోటములు సహజం అనీ, ఎవరినీ కించపరచవద్దని’ పేర్కొన్నారు. స్మృతి ఇరానీని గానీ, మరెవరిని కానీ అవమానించడం, దుర్భాషలాడడం చేయకూడదని హితవు చెప్పారు. గతంలో 2019లో రాహుల్‌పై స్మృతి గెలుపొందింది. గత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆమె రాహుల్‌పై తీవ్ర విమర్శలు చేసింది. అమేథీ నుండి రాహుల్ భయపడి పోటీ చేయలేకపోతున్నాడని వ్యాఖ్యానాలు చేసింది. దీనితో ఇప్పుడు ఆమె ఓడిపోయి, రాహుల్ రెండు నియోజక వర్గాలలో గెలవడంతో కాంగ్రెస్ మద్దతుదారులు ఆమెను విమర్శిస్తున్నారు.

