ట్విట్టర్లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్
ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ నిర్వహించిన పోల్ తర్వాత, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎకౌంట్‌ను పునరుద్ధరించారు. 15 మిలియన్లకు పైగా ప్రజలు ట్రంప్ ఖాతాని పునరుద్ధరించాలా వద్దా అని అడిగే పోల్‌లో ఓటు వేశారు. 51.8 శాతం తక్కువ మెజారిటీతో సానుకూలంగా ఓటింగ్ జరిగింది. డొనాల్డ్ ట్రంప్ యొక్క అపఖ్యాతి పాలైన ట్విట్టర్ ఖాతాను తిరిగి పునరుద్ధరించారు. మాజీ US అధ్యక్షుడు మరొసారి వైట్ హౌస్ అధ్యక్షుడిగా ఎంపికయ్యేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించిన కొద్ది రోజులకే ఆయనకు సానుకూలత లభించింది. 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలని కోరుతూ జనవరి 6న US క్యాపిటల్‌పై దాడికి పాల్పడినందుకు, ట్రంప్ మద్దతుదారులను రెచ్చగొట్టారన్న కారణంతో గత ఏడాది ప్రారంభంలో ప్లాట్‌ఫారమ్ నుండి నిషేధించడం జరిగింది. తన ఖాతాలో 24 గంటల ట్విటర్ పోల్ ముగిసిన కొద్దిసేపటికే, ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పారు… ట్విట్టర్లోకి ట్రంప్ వస్తున్నారని మస్క్ ట్వీట్ చేశారు.
వోక్స్ పాపులి, వోక్స్ డీ, అంటూ లాటిన్ సామెతను గుర్తు చేసిన మస్క్… ప్రజల స్వరం దేవుని స్వరం అని రాసుకొచ్చాడు. 23 కోట్ల 70 లక్షల మంది ట్విట్టర్ వినియోగదారుల్లో సుమారుగా కోటిన్నర మంది ట్రంప్ ఎకౌంట్ ఉంచాలని ఓటేశారు. ఖాతా సస్పెండ్ చేసినప్పుడు 88 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ట్రంప్, తన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్విట్టర్‌ను మౌత్‌పీస్‌గా ఉపయోగించడం, విధాన ప్రకటనలను పోస్ట్ చేయడం, రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేయడం, మద్దతుదారులతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించేవారు. ట్విట్టర్లో ట్రంప్ తిరిగి రావడాన్ని ఆయన మద్దతుదారులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

