బస్సు ముందు డ్రైవర్ డ్యాన్స్ ..తర్వాతేమయ్యిందో తెలుసా..
ఆర్టీసీ బస్సు ముందు డ్రైవర్ డ్యాన్స్ చేసిన ఘటన ఏపీలో వైరల్ అయ్యింది. అది మంత్రి లోకేశ్ దాకా చేరింది. దీనితో డ్రైవర్ లోవరాజును అభినందిస్తూ ట్వీట్ చేశారు లోకేశ్. దీనికి కారణమేమంటే బస్సు వెళ్లే దారిలో రోడ్డు బాలేకపోవడంతో కొద్దిసేపు బస్సును ఆపాల్సి వచ్చింది. ఆ సమయంలో బస్సులోని పిల్లల కోరికపై డ్యాన్స్ చేశారు డ్రైవర్ లోవరాజు. ఆయనకు చిన్న వయసు నుండి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఇది వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టారు. మంత్రి అభినందించినా అతనిని దురదృష్టం వెన్నాడింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. దీనితో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు.

