Home Page SliderNational

ఒలింపిక్స్ వీరుల కోసం ట్రైనింగ్ ఖర్చు ఎంతో తెలుసా?

భారత్ నుండి పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లబోయే ఒలింపిక్స్ ప్లేయర్ల కోసం కేంద్రప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. ఒలింపిక్స్‌ పోటీలో పాల్గొనబోయే అభ్యర్థుల కోసం కోట్ల రూపాయలు వారికి శిక్షణ ఇవ్వడానికి వెచ్చిస్తోంది. వీరిలో అత్యధికంగా జావెలిన్ త్రో వీరుడు నీరజ్ చోప్రా కోసం ఏకంగా రూ.5.72 కోట్లు వెచ్చిస్తోంది. ఈ సారి ఎలాగైనా నీరజ్ చోప్రా బంగారు పతకం సాధిస్తాడని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ పేర్కొన్నారు.  బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కోసం రూ3.13 కోట్లు, రెజ్లర్ వినేశ్ ఫొగట్ కోసం రూ.70.45 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. వీరందరూ పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో భారత్ తరపున పాల్గొననున్నారు.