HealthHome Page Slider

వీటి గురించి మీకు తెలుసా?

ఆరోగ్యం మహాభాగ్యం అని మనం చిన్నప్పటి నుంచి వింటూనే వున్నాం కానీ.. పెద్దయిన తరువాత మహాభాగ్యం అంటే మేడలూ, మిద్దెలూ కట్టడం అనుకున్నాం. మహాభాగ్యం అంటే ఆరోగ్యమే కానీ ధనం కాదు.. ఆరోగ్యం అన్నదే సంపద.. అందుకు నిత్యం మనం హెల్త్ గురించి తెలుసుకోవాలి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటే మంచిదనే విషయంపై దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనం హెల్త్ టిప్స్ గురించి తెలుసుకుందాం.

ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడదు. ఎక్కువ సేపు నమలడం ద్వారా ముఖంలోని కండరాలు శ్రమిస్తాయి. చర్మపు మెటబాలిజమ్ మెరుగవుతుంది. కాబట్టి ముడతలు పడవు.

బెల్లంలో మిరియాల పొడి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని నిద్రించే ముందు తీసుకుంటే జలుబు తగ్గుతుంది.

ఒక గ్లాసు మంచినీరు, 5 లేక 6 మిరియాలు, ఒక వెల్లుల్లి రెబ్బ, చితక్కొట్టిన అల్లం ముక్క ఒకటి, చిన్న బెల్లం ముక్క ఇవన్నీ వేసి నీరు సగం అయ్యేంత వరకు కాచండి. వేడిగా ఉండగానే తాగండి. దీనిని సేవించడం వల్ల దగ్గు, జలుబు, గొంతు గరగర వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

బాదం పప్పు, గసగసాలు కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది.

బొప్పాయి కాయను కానీ, ఆకుని కానీ మెత్తగా కాటుకలా నూరి ఆ ముద్దని అరికాళ్ళ ఆనెల మీద పెట్టి, కట్టుకడితే అవి మెత్తబడతాయి.

మజ్జిగలో కొంచెం పసుపు, కాస్త ఉప్పు కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి.