క్రెడిట్ కార్డు వాడకంలో ఇవి పాటిస్తున్నారా..
మనసర్కార్
క్రెడిట్ కార్డును దర్జాగా వాడుకోవడమే కాదు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డు బిల్లులను క్రమం తప్పకుండా కడుతూ రావాలి. లేకపోతే భారీగా పెనాల్టీలు కట్టవలసి వస్తుంది. అంతే కాదు అధిక వడ్డీలతో మోత మోగిపోతుంది. అన్ని సందర్భాలలో సరైన సమయానికి బిల్లు కట్టలేకపోవచ్చు. అందుకే క్రెడిట్ కార్డుపై సరైన శ్రద్ధ వహించండి. సాధారణంగా కార్డు డ్యూడేట్ తర్వాత 3 రోజుల గడువు లభిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా బిల్లు మొత్తాన్ని చెల్లించకపోతే వారి క్రెడిట్ కార్డు ఎకౌంట్‌ను పాస్డ్ డ్యూటు క్రెడిట్ ఇన్ ఫర్మేషన్ కంపెనీలుగా ప్రకటిస్తాయి. లేట్ పేమెంట్ చార్జీలు కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. అధిక వడ్డీ పడుతుంది. అందుకే క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది.

