Home Page SliderNational

చిన్నారులకు ఆ రెండు దగ్గుమందులు వాడొద్దు: WHO

భారత్‌లో తయారైన రెండు దగ్గు మందులను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కాగా ఆ రెండు దగ్గుమందులలో నాణ్యత లోపించిందని తెలిపింది. భారత్‌లో తయారు చేసిన దగ్గుమందు వాడడం వల్ల ఉజ్బెకిస్తాన్‌లో చిన్నారులు చనిపోయారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై స్పందించింది.

నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేసిన రెండు దగ్గుమందులను ఉజ్బెకిస్తాన్‌లోని చిన్నారులకు వాడొద్దని ఇలా హెచ్చరించింది. ఉజ్బెకిస్తాన్‌లో సంభవించిన చిన్నారుల మరణాల నేపథ్యంలో మరియన్ బయోటెక్ సంస్థ  తయారు చేసిన రెండు  దగ్గుమందులను వాడొద్దని సూచిస్తున్నాము. వాటి పేర్లు “అబ్రోనాల్” , “డాక్-1 మ్యాక్స్” అని తెలిపింది. ల్యాబ్ రిపోర్ట్‌ల ప్రకారం..ఆ  రెండింటిలో పరిమితికి మించి డైఇథిలిన్ గ్లైకాల్,ఇథిలిన్ ఉన్నట్లు గుర్తించామని వెల్లడించింది. అంతేకాకుండా ఈ సంస్థ తయారు చేసిన దగ్గుమందులు నాసిరకమైనవని,నాణ్యతా ప్రమాణాలు అందుకోవడంలో విఫలమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనలో పేర్కొంది.