బుర్జ్ ఖలీఫాపై వెలుగుల దీపావళి
ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫాపై దీపావళి సందర్భంగా వెలుగులు విరజిమ్మాయి. దీపావళి నాడు ఇంగ్లీష్, హిందీ భాషలలో హిందువులకు దుబాయి ప్రభుత్వం తరపున దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ పలు విజువల్స్ ప్రదర్శించారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూడడానికి వేల మంది అక్కడ గుమి గూడగా, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు లైకులు, కామెంట్లు చేస్తున్నారు. వీడియో చూసిన వారు ఫిదా అవుతున్నారు.

