వాయువేగంతో ధోనీ స్టంపింగ్..వైరల్ అవుతున్న వీడియో..
కెప్టెన్ కూల్‌గా క్రికెట్ అభిమానులు పిలుచుకునే ధోనీ వికెట్ కీపింగ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పడతాయి. ఆదివారం జరిగిన చైన్నై, ముంబయి ఐపీఎల్ మ్యాచ్‌లో వికెట్ కీపింగ్‌లో తనదైన మార్క్ చూపించారు. 43 ఏళ్ల వయసులో కూడా అత్యంత వేగంగా కేవలం 0.12 సెకన్లలోనే బెయిల్ పడగొట్టి అభిమానులను ఆశ్చర్యపరిచారు. 11 వ ఓవర్లో చైన్నై బౌలర్ నూర్ అహ్మద్ వేసిన బంతిని క్యాచ్ పట్టిన ధోనీ కనురెప్ప ఆర్పేలోపే వికెట్లకు గిరాటేశాడు. అది చూసి, షాకయిన ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ వీడి వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

