News

నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్

వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. మంగళవారం విద్యార్థి, యువజన సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నారాయణగూడ సర్కిల్ నుండి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. మరోవైపు బీఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో రాజ్‌భవన్ ముట్టడికి తరలిరాగా.. పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసిన పోలీసులు.