ఓటమి కూడా మంచిదే..ఆర్సీబీ బ్యాటర్ కీలక వ్యాఖ్యలు
శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు ఓడిపోవడం మంచిదయ్యింది అంటూ ఆర్సీబీ బ్యాటర్ ఫిల్ సాల్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోవడం కంటే ఇప్పుడు ఓడిపోవడమే మంచిదని పేర్కొన్నారు. సన్‌రైజర్స్ నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఆర్సీబీ 189 పరుగులకే ఆలౌటయ్యింది. దీనితో పాయింట్ల పట్టికలో మూడోస్థానంతోనే సరిపెట్టుకుంది. బెంగళూరు జట్టు ఇప్పటివరకూ ఆడిన 13 మ్యాచ్‌లలో 8మ్యాచ్‌లలో విజయం సాధించి 17 పాయింట్లతో ఉంది. అయితే సాల్ట్ మాట్లాడుతూ తమ టీమ్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరిందని, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచి ముందుకు దూసుకుపోతుందని, ఇప్పుడు ఓడిపోవడం వల్ల నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు.

