దానా తుపాన్ బీభత్సం- ఆ జిల్లాలలో భారీ వర్షాలు
దానా తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపాన్‌గా మారి గురువారం ఉదయం నాటికి తీవ్రరూపం దాల్చింది. ఈ తుపాన్ ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపేట, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు రెండవ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఒడిశాలోని పూరీ, పశ్చిమ బెంగాల్‌లోని బిత్తర్‌కనిక, ధమ్రా(ఒడిశా)కు దగ్గరలో శుక్రవారంలోగా తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. దానా తుపాన్ ప్రభావం వలన తూర్పు రైల్వే పరిధిలో గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం 10 గంటల వరకూ నడిచే 190 రైళ్లను రద్దు చేస్తున్నారు. ఒడిశాలో జరగవలసిన సివిల్ సర్వీసెస్ పరీక్షను కూడా వాయిదా వేశారు.

