కిటకిటలాడిన వైకుంఠ వాకిళ్లు
వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలను జంట నగరాల పరిధిలోని అన్నీ వైష్ణవాలయాల్లో శుక్రవారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. వైష్ణవాలయాలు,శివాలయాలు అన్నీ హరినామ సంకీర్తనల,నామ పారాయణ,గోవింద నామస్మరణలతో మారుమ్రోగాయి. హైద్రాబాద్,సికింద్రాబాద్‌లో ని శ్రీకృష్ణ,శ్రీరామ,శ్రీవిష్ణు,భక్త హనుమ,శ్రీనరసింహ,శ్రీవరాహ స్వామి వార్ల ఆలయాల్లో రెండు రోజుల ముందు నుంచే అలకంరీకృత వేడుకలను చేపట్టారు.ఆలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు.పూలు,కళాకృత దొంతెరలు,రంగవల్లులతో వైకుంఠ వాకిళ్లను ప్రతిబింబించేలా రూపుదిదిద్దారు.ఆయా ఆలయాల ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో,,, తెల్లవారుఝాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.భక్తుల సమక్షంలో…స్వామి వారి మూలమూర్తిని ఉత్సవ మూర్తిలోకి ఆవాహనం చేసి బ్రహ్మమూహూర్తంలో స్వామి వార్లకు బావినీళ్ల స్నానం,పట్టు వస్త్రాలధారణ, కాగడాల దర్శనం, మాడవీధుల ఊరేగింపు అనంతరం … ఉత్తరాభిముఖంగా అధిష్టింపజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెల్లవారుఝామునే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకుని దీపోత్సవాలు జరిపారు.జూబిలీ హాల్స్,కృష్ణనగర్,శ్రీనివాస కాలనీల్లోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు.అనంతరం ఉత్తరద్వారంలో స్వామి వార్లను దర్శించుకుని తీర్దప్రసాదాలు తీసుకున్నారు.