తిరుమలలో పాము హల్‌చల్
శ్రీవారి భక్తుల దివ్యధామం, కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తకోటితో పాటు ఎన్నో జంతుజాలాలు కూడా తిరుగాడుతూ ఉంటాయి. కరోనా సమయంలో లాక్‌డౌన్ కారణంగా దర్శనాలు నిలిపివేసినప్పుడు చిరుతలు కూడా తిరుమల కార్యాలయాల వద్ద సంచారం చేయడం వార్తలలో చూసాం. తాజాగా జేఈవో కార్యాలయం గోకులం సమీపంలో రోడ్డుపైకి ఒక పాము వచ్చింది. దీనితో భక్తులు భయంతో పరుగులు తీసారు. పాములను పట్టుకునే భాస్కర నాయుడిని అధికారులు పిలిపించారు. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు పామును పట్టుకొని సురక్షిత ప్రాంతం లో వదిలివేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Read more: శరవణ బ్రాండ్… 50 ఏళ్ల వయసులో హీరో రోల్