లోకేష్‌కు ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్పు ముందే తెలుసా… సీఐడీ ప్రశ్నల వర్షం
తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో లోకేష్‌ను సీఐడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. సీఐడీ అధికారులు లోకేష్‌ను ప్రశ్నలవర్షంలో ముంచెత్తుతున్నారు. లోకేష్‌తో పాటు న్యాయవాదిని కూడా విచారణకు అనుమతించారు. దీనితో న్యాయవాది సమక్షంలోనే విచారణ కొనసాగుతోంది. లోకేష్‌కు ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్పు ముందే తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు.
మూడుసార్లు అలైన్‌మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉందా? ఈ విషయం సీఎం చంద్రబాబు ద్వారానే మీకు తెలిసిందా?
ఈ అలైన్‌మెంట్ హెరిటేజ్ లబ్ధి చేకూరేలా రూపొందించింది. అందుకే కదా హెరిటేజ్ సంస్థ అక్కడే భూములు కొనుగోలు చేసింది ? 2014లోనే ఈ భూములు కొనే తీర్మానం జరిగింది కదా?
లింగమనేని రమేష్‌తో మీకున్న సంబంధాలేంటి? అంటూ ప్రశ్నలు సంధించారు.
ఈ కేసులో మరో ఊహించని ట్విస్ట్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను మారుస్తున్నట్లు కూడా ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో వేసింది. ఇప్పటి వరకూ ఐవోగా పేర్కొన్న అడిషనల్ ఎస్పీ జయరామరాజు పేరు తొలగించి, ఆ స్థానంలో డీఎస్పీ భాస్కర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.