NewsTelangana

ఇక మీదట నిబంధనలు తప్పితే జైలుకే..

Share with

సిటీ పోలీస్‌లు నంబర్ ట్యాంపరింగ్‌పై గతకొద్ది రోజులుగా తనిఖీలు నిర్వహిస్తూ , కేసులు నమోదు చేస్తున్నారు. వాటిపై మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు 100 కేసులను నమోదవ్వడంతో ఆంక్షలు కఠినతరం చేయాలని నిర్ణయించారు. ఇక పై వాహనదారులు నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపినా… నెంబర్ కనిపించకుండా చేసినా… రిజిస్ట్రేషన్ గడువు పూర్తయినా… అదే నెంబర్‌తో బండి నడిపిన, ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటించకపోయిన వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయనున్నారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌లో 100కు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ కేసుల విషయమై సీటీ పోలిస్‌లు చాలా సీరియస్ అయ్యారు. బండి ఎవరి పేరుతో నమోదైతే వారే దానికి పూర్తి బాధ్యులవుతారని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. శాంతి భద్రతలను , నేరాలను అదుపులో ఉంచేందుకే పోలీసులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. కొంత మంది ఫైన్ తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్లు మార్చడం , మరికొందరు దొంగతనాలు చేసి తప్పించుకోవడానికి ఈ ట్యాపరింగ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక మీదట ఎవరైన నెంబర్ లేకుండా , ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయిన , గడువు పూర్తయిన తర్వాత కూడా అదే నెంబర్‌తో వాహనం నడపడం చేస్తే వారిపై కేసులు నమోదు చేసి… చార్జీషీట్ వేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ విషయంలో వాహన యజమానులు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ హెచ్చరించారు.