భారతదేశంలో కరోనా డేంజర్ బెల్స్
భారతదేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో దేశ ప్రజల్లో ఆందోళన నెలకొంది. దేశంలో ఇవాళ కొత్తగా 3,095 కరోనా కేసులు నమోదు కాగా ,గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 5గురు మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 15,208కి చేరింది. అయితే ఇప్పటివరకు దేశంలో కరోనా కారణంగా 5,30,867 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు దేశంలలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

