అమరావతి పేరును వినపడకుండా చేయడానికి కుట్ర
అమరావతి: అధికార పార్టీ వేధింపులు, పోలీసుల అక్రమ కేసులకు బెదరకుండా అమరావతి రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన చేశారు. ఏపీ రాజదాని అమరావతిలో నివాసం ఏర్పరుచుకున్న మొదటి రాజకీయ నేత తానేనని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి, మడమ తిప్పేశారు. నాలుగేళ్లుగా ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. అమరావతి పేరెత్తకుండా చేయడానికి సీఎం జగన్ మూడు రాజధానుల కుట్రకు తెరలేపారు.

