పార్టీ ఫిరాయింపులతో తెలంగాణలో పెరిగిన కాంగ్రెస్ బలం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటోంది. 64 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 70 ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకుంది. వీరిలో ఐదుగురు బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి వచ్చినవారే. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కాంగ్రెస్‌లోకి జంప్ చేయడంతో 69 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలో గెలుపొందడంతో 70కి చేరుకుంది. 39 సీట్లు గెలిచిన బీఆర్‌ఎస్ పార్టీ 5స్థానాలు కోల్పోవడంతో 34 స్థానాలకు పరిమితమయ్యింది.

