సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడింది
మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గతంలో కంటే మహారాష్ట్ర ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజెపి కైవసం చేసుకుందన్నారు.మోదీ అభివృద్ది మంత్రం బాగా పనిచేసిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మంత్రులంతా కట్టగట్టుకుని వెళ్లి మరీ ప్రచారం చేసినా కాంగ్రెస్ కనీస స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయిందన్నారు. బీజెపి ఇచ్చిన,ఇస్తామన్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు మొగ్గు చూపారన్నారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో బీజెపి జెండా రెపరెపలాడించి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

