Andhra PradeshNews

అప్పు తప్పు కాదంటున్న బుగ్గన

Share with

ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే దురుద్దేశంతో అప్పులపై దుష్ప్రచారం జరుగుతుందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. వివిధ రాష్రాల అప్పులపై పార్లమెంటులో ప్రశ్న అడిగితే , ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్రం గురించి అడిగినట్టుగా చిత్రీకరించారన్నారు. 2014 నుండి 2019 మధ్యకాలంలో టిడిపి ప్రభుత్వ హాయాంలోనే అప్పులు ఎక్కువగా చేసారని , అనవసర అప్పులు ఆ కాలంలోనే ఎక్కువగా జరిగాయని  పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా అప్పులు చేశామని… కాని టిడిపి ప్రభుత్వ హయాంతో పోల్చితే తాము చేసిన అప్పులు చాలా తక్కువన్నారు.

కర్ణాటకలో సగటున ఏడాదికి  అప్పుల భారం రూ. 60వేల కోట్లు , తమిళనాడులో రూ. 1 లక్ష కోట్ల అప్పు  పెరిగిందన్నారు బుగ్గన. జనాభా పరంగా చూసిన, మరే విధంగా చూసిన అప్పుల శాతం ఏపీలో చాలా తక్కువేనని తెలిపారు. స్థూల ఉత్పత్తిలో పోల్చితే ఈ అప్పులు ఏ విధంగా ఎక్కువ  అని బుగ్గన ప్రశ్నించారు ? నిజానికి వైసీపీ హాయంలో చేసిన అప్పులు స్థూల ఉత్పత్తితో పోల్చిన చాలా తక్కువేనన్నారు. ఏడాదికి ఏపీలో 15 శాతం నుండి 16 శాతం వరకు అప్పు పెరిగితే మిగత రాష్ట్రాల్లో 20 శాతం వరకు పెరిగిందన్నారు. అదే విధంగా ద్రవ్యలోటు 2014 లో 3.95 శాతం  ఉంటే , 2021-22 నాటికి ప్రభుత్వ హయాంలో 3 శాతం తగ్గించమని చెప్పారు. ఏపీతో పొలిస్తే మిగత రాష్ట్రాలలో ద్రవ్యలోటు 4 శాతం అధికంగా ఉందన్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా యావద్దేశంలో అప్పు శాతం పెరిగిందని… అది గుర్తించకుండా ఒక్క ఏపీ  మాత్రమే అప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తూన్నారని బుగ్గన మండిపడ్డారు.