పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ అభినందనలు
పంచాయతీ ఎన్నికలను ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. మూడు విడతలుగా రాష్ట్రవ్యాప్తంగా 12,702 చోట్ల జరిగిన ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 7,527 పంచాయతీలలో విజయం సాధించగా, పార్టీ రెబల్స్ 808 స్థానాలను గెలుచుకున్నారని వెల్లడించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న అభ్యర్థులు 8,335 స్థానాల్లో గెలిచి 66 శాతం విజయాన్ని సాధించారని సీఎం పేర్కొన్నారు. అలాగే 3,511 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు, 710 చోట్ల బీజేపీ, 146 పంచాయతీల్లో ఇతరులు విజయం సాధించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

