Andhra PradeshHome Page Slider

గవర్నర్ పాదాలకు సీఎం జగన్ నమస్కారం

గవర్నర్ పాదాలకు నమస్కరించి.. ఘనంగా వీడ్కోలు చెప్పారు సీఎం వైఎస్ జగన్. ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా బదిలీపై వెళ్లిన బిశ్వభూషణ్ హరిచందన్‌కు గన్నవరం విమానాశ్రయంలో ప్రభుత్వ ఆత్మీయ వీడ్కోలు పలికింది. ఇవాళ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ మూడున్నరేళ్ల పదవీకాలం ముగిసింది. ఆయన ఛత్తీస్ గఢ్ గవర్నర్‌గా వెళ్లిపోయారు. నూతన గవర్నర్‌గా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు రాష్ట్రానికి రానున్నారు. గవర్నర్‌గా బాధ్యలు స్వీకరిస్తారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు బుధవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఘన వీడ్కోలు పలికారు.

తద్వారా గవర్నర్ పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు. ముందుగా గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్ పాదాలకు నమస్కరించి ముఖ్యమంత్రి జగన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లిపోవడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ ను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పాలనను విశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసించారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఏ వర్గాన్ని కూడా విస్మరించడం లేదని అభినందించారు. గవర్నర్ కు వీడ్కోలు పలికిన వారిలో మంత్రి జోగి రమేష్, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.