విద్యుత్ అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం విద్యుత్ అధికారులను హెచ్చరించారు. ఇకపై ఇష్టానుసారంగా పవర్ కట్స్ ఉండకూడదన్నారు. ఎవరైనా సరిగ్గా పనిచేయకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో లో వోల్టేజ్ సమస్య ఉండకూడదన్నారు. ఎప్పుడు ఎక్కడ పవర్ కట్ అయ్యింది అనే వివరాలను ట్రాక్ చేసే అవకాశం ఉందన్నారు. కాబట్టి అన్ని మానిటరింగ్ చేయొచ్చు అని సీఎం తెలిపారు. ఏపీలో క్వాలిటీ విద్యుత్ అందించాలని..ఇకపై ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.


 
							 
							