Home Page SliderNational

క్షమాపణలు కోరిన బిగ్ బి..అసలేమైంది?

Share with

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ క్షమాపణలు చెప్పడం ఏంటని ఆలోచిస్తున్నారా? మరేం లేదండీ ఈ నెల 11న బిగ్ బి పుట్టిన రోజు. కాగా ఆ రోజు ఆయనకు ఎంతో మంది SMS ద్వారా  శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బి అప్పుడు వారందరికి రిప్లై ఇవ్వలేక పోయారంట.దీంతో ఆయన తనకు విషెస్ తెలిపిన వారికి రిప్లై ఇవ్వలేకపోయినందుకు తనను క్షమించాలని ట్వీట్ చేశారు. “చాలా మంది నా పుట్టిన రోజున SMS ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కానీ నేను రిప్లై ఇవ్వనందుకు వారు ఫీల్ అయి ఉంటారు. చాలా రోజులుగా నా మొబైల్‌లో సిగ్నల్స్ సరిగా రావట్లేదు. దీనిపై సర్వీస్ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేసినా మార్పు లేదు. నా రిప్లై పొందని వారందరూ ప్లీజ్  నన్ను క్షమించండి” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.