ఉజ్జయిని మహంకాళి అమ్మవారి భవిష్యవాణి, అందుకే ఈ వర్షాలా!
ఉజ్జయిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాలలో భాగంగా ఈరోజు ‘రంగం’ కార్యక్రమం నిర్వహించి, అమ్మవారి ఉరేగింపు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జోగిని స్వర్ణలత ప్రజలకు భవిష్యవాణిని ఈ విధంగా వినిపించారు. “ నాకు మెక్కుబడిగా పూజలు నిర్వహిస్తూ , ఏటా జరిపే పూజలు ఎలా నిర్వహించాలో నన్నే అడగుతున్నారు. ఆ పూజలు నా సంతోషం కోసం కాదుగానీ మీ కోసమే అన్నట్టుగా నిర్వహిస్తున్నారు. సంతోషంగా పూజ చేస్తున్నామని అంటున్నారు కాని అలా ఎంత మాత్రం జరుగుతున్నాయి? నా బిడ్డలే కదా అని కడుపులో పెట్టుకొని అన్ని భరిస్తూన్నా… కానీ , దొంగలు దొచినట్టు మీరు నన్నే దొచుకుంటున్నారు. మీకు నచ్చిన రూపంలోకి నన్ను మార్చేస్తున్నారు. ప్రతి ఏటా చెబుతున్నా పట్టిచుకోవడంలేదు . మీ కళ్లు తెరిపించడానికే ఆగ్రహంతో వర్షాలు కురిపిస్తున్నాను, ఇక మీదటైనా నా గుడిలో శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించండి.