NewsTelangana

10వ తరగతి బాలికపై తోటి విద్యార్థులు గ్యాంగ్ రేప్

పదో తరగతి విద్యార్థినిపై ఐదుగురు సహచరులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ క్రూరమైన నేరానికి సంబంధించిన వీడియోను మిగతా విద్యార్థులకు షేర్ చేయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ పరిధిలోని తట్టి అన్నారం వైఎస్‌ఆర్‌ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్యాంగ్ రేప్ ఈ ఏడాది ఆగస్టులో జరిగినట్టు తెలుస్తోంది. బాలిక క్లాస్ మేట్స్‌లో ఐదుగురు బాధితురాలి ఇంట్లోకి చొరబడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విద్యార్థినులు తమ సెల్‌ఫోన్‌లో మొత్తం చర్యను చిత్రీకరించారు. ఈ వ్యవహారాన్ని బయటపెడితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బాలికను బెదిరించారు. వీడియోతో బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ 10 రోజుల తర్వాత మళ్లీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో మొత్తం ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులంతా మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోమ్‌కు తరలించే అవకాశం ఉంది.