హేతువాదులు, భజరంగ్‌దళ్ మధ్య ఘర్షణ
చంద్రగ్రహణం సందర్భంగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రహణ సమయంలో ఆహారం తిన్నా ఏమీ కాదని అవగాహన కల్పిస్తూ స్థానిక లోహియా అకాడమీ వద్ద హేతువాదులు చికెన్ బిర్యానీ పంపిణీ చేపట్టారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడికి చేరుకున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు హేతువాదులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు భారీగా చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో కొందరు పోలీసు అధికారులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ వివాద సమయంలో ఆవు పేడ విసిరినట్లు తెలుస్తోంది. బిర్యానీ పంపిణీ హిందూ సంప్రదాయాలకు విరుద్ధమని భజరంగ్ దళ్ కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ హింసాత్మక ఘటనలో అనేక దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. గ్రహణం సమయంలో తినడం వల్ల ఎవరి ఆరోగ్యంపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదని, అదొక మూఢ నమ్మకం అని హేతువాదులు అన్నారు.