సివిల్స్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి శుభవార్త
హైదరాబాద్ : సివిల్స్ అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. యూపీఎస్సీ మెయిన్స్ క్వాలిఫై అయిన 43 మంది తెలంగాణ అభ్యర్థులు ఇంటర్యూకు అర్హత సాధించడంతో వారి కోసం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అమలు చేస్తున్నామన్నారు. సింగరేణి సీఎస్ఆర్ ప్రోగ్రామ్ లో భాగంగా వీరికి సీఎం రేవంత్ త్వరలోనే రూ. లక్ష చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలో ఉచిత వసతి కల్పించడంతో పాటు మాక్ ఇంటర్యూలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మొత్తం అభ్యర్థులలో 2,736 మంది మెయిన్స్ క్లియర్ చేయగా, వారి ర్యాంక్, పేర్లను యూపీఎస్సీ వెబ్ సైట్ లో ఉంచారు. వీరికి ఇంటర్యూ నిర్వహించి, పలు సెంట్రల్ సర్వీసులు కేటాయిస్తారు.

