కోర్టుకి హాజరైన ముఖ్యమంత్రి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనపై నమోదైన కేసు విషయంలో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరయ్యారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై అప్పట్లో 4 కేసులు నమోదయ్యాయి. నేడు 3 కేసులు విచారణకు రావడంతో ఆయన స్వయంగా హాజరు కావలసి వచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 23కు వాయిదా వేశారు.

