ప్రజలను చీట్ చేస్తోంది మీ తండ్రి కాదా? అసలు చీటర్ ఎవరు కేటీఆర్..!?
పథకాలు ఎగ్గొట్టి ప్రజలను చీట్ చేసిందెవరు?
ఒక్క పథకమైన చెప్పినట్టుగా అమలు చేశారా?
నాడు మోడీ అంతటోడు లేడన్న కేసీఆరే కదా?
తెలంగాణకు ఏం తక్కువ చేశఆరని మోడీని విమర్శిస్తారు?
విశ్వాసానికి మారు పేరు నరేంద్ర మోడీ…. విశ్వాస ఘాతుకానికి మారుపేరు కెసిఆర్ అన్నారు నిజం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కూతురు కవిత ఎంపీగా పోటీచేసిన నాడు…కవితని గెలిపించండి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? అదే మోదీ రామగుండం ఎరువుల కర్మాగారం చెప్పకపోయినా 6300 కోట్ల రూపాయలు పెట్టి తెరిపించి మన రైతులకు ఎరువుల కొరత లేకుండా చేశారన్నారు. తెలంగాణ కోసం నిధులు ఇస్తున్న మోదీని.. ఏం ముఖం పెట్టుకొని వస్తావని అడుగుతున్నారని.. ఇదేం మర్యాద అంటూ ఈటల మండిపడ్డారు. కేంద్రంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పక్కన ఇంట్లో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కోరితే రూ. 350 కోట్లు సిద్ధిపేట రైల్వే లైన్ కోసం 2005లో కేటాయించారు. కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. కానీ మోదీ వచ్చాక రైలే ప్రారంభించారన్నారు ఈటల. సీఎం ఫోటో లేకపోతేతే అడగాలి కానీ కాలితో తన్నే కుసంస్కరం ఏంటని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనేక పథకాలు నడుస్తున్నాయి. మీకు అంత సంస్కారం ఉంటే ఎందుకు ఫోటో పెట్టలేదని ఈటల గులాబీ నేతలను ప్రశ్నించారు.

బియ్యం మూడు రూపాయలకు ఇస్తుంది కేంద్రం, కానీ రేషన్ కార్డు మీద ప్రధాని ఫోటో ఉండదన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇచ్చేది కేంద్రం కానీ ప్రధాని ఫోటో ఉండదని ఇదేం పద్ధతని ఈటల మండిపడ్డారు. మా ఫోటోలు ప్రజల గుండెల్లో ఉంటాయి. మీరు ఎన్ని ఫ్లెక్స్ పెట్టుకున్నా మీరు ప్రజల హృదయాల్లో ఉండరని బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. దేశ ప్రధాని ఫోటో దేశ ప్రజలందరి గుండెల్లో ఉంటుందని… మోదీ ఫోటో ఉందని తన్నుతున్నారు.. ఎటు పోతున్నావు హరీశ్… ఇదేనా మీ సంస్కారం అంటూ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ లో మీటింగ్ లో ప్రధాని మోదీని కేసీఆర్ పొగిడిన వీడియో చూపించారు బీజేపీ అగ్రనేత ఈటల రాజేందర్. అవినీతి లేని పాలన మోదీ అందిస్తున్నారని కితాబిచ్చారన్నారు. 32% టాక్స్ డేవల్యుషన్ ను 42% పెంచిన ఘనత మోదీదే అని పొగిడారు. నేషనల్ హైవే తెలంగాణ వచ్చిన నాటికి 2500 కిలోమీటర్ల ఉంటే మోదీ వచ్చాక 2500 కిలోమీటర్లు వేశారని పొగిడారు. మోదీ ఆశీర్వాదం ఉంటే చాలు అన్న వీడియోను ఈటల మీడియాకు చూపించారు.

