తెలంగాణాలో పోలీస్ తుది రాతపరీక్ష తేదీల్లో మార్పులు
తెలంగాణాలో జరగాల్సిన పోలీస్ తుది రాతపరీక్షల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కాగా ఈ విషయాన్ని TSLPRB అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం తెలంగాణా రాష్ట్రంలో ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ (ఐటీ) పరీక్ష ఏప్రిల్ 30కి వాయిదా పడింది. అంతేకాకుండా మార్చి 12 న జరగాల్సిన ఎస్సై (ఐటీ) , ఏఎస్సై (ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 11కి వాయిదా వేసినట్లు TSLPRB వెల్లడించింది. అయితే తెలంగాణా రాష్ట్రంలో గత ఏడాది ఆగష్ట్ 7న TSLPRB పోలీస్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం దేహధారుడ్య పరీక్షలను కూడా నిర్వహించింది.కాగా ఈ రెండింటిలో అర్హత సాధించినవారికి జరగాల్సిన తుది పరీక్షల తేదీలల్లో మార్పులు చేసినట్లు TSLPRB పేర్కొంది.

