చంద్రయాన్ 3సక్సెస్‌తో సువర్ణావకాశం- ఇస్రో చేతికి నాసా ఉపగ్రహం
చంద్రయాన్ 3విజయవంతం కావడంతో ఇస్రో ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. అంతరిక్ష పరిశోధనలలో మొదటిస్థానంలో ఉన్న అమెరికాకు చెందిన నాసా సంస్థ ఇస్రోతో సంబంధానికి ఉవ్విళ్లూరుతోంది. ఇస్రోకి నాసా ఉపగ్రహాన్ని అప్పగించనుంది. ఇస్రోతో కలిసి నాసా అభివృద్ధి చేసిన NISAR అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించే బాధ్యతను ఇస్రోకి అప్పగించింది. యూఎస్ స్పేస్ ఏజెన్సీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటికే పెద్ద వ్యాన్ సైజ్‌లో ఉండే పేలోడ్‌ను ప్రత్యేకంగా కంటైనర్‌లో బెంగళూరుకు తరలించినట్లుగా తెలియజేశారు. వచ్చే సంవత్సరంలో దీనిని ప్రయోగించనున్నారు. 2024లో దీనిని శ్రీహరికోట నుండి ఇస్రో ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెడతారు. ఈ NISAR ఉపగ్రహం 12 రోజుల పాటు భూగ్రహాన్ని చుట్టేసి, వివిధ ప్రయోగాలు, పరిశోధనలు చేయనుంది.

