ఏపీ గవర్నర్‌తో చంద్రబాబు సమావేశం
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఉదయం కూటమి ఎమ్మెల్యేల మద్దతుతో ఏపీ సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా ఈ ఉదయం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,జనసేన రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్,బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటును చేయాలని కోరారు. ఈ మేరకు ఏపీలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారిని రాజ్ భవన్‌కు ఆహ్వనించారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా ఏపీ గవర్నర్‌ను కలిశారు. కాగా రేపు ఉదయం కేసరపల్లిలోని ఐటీ పార్క్‌లో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే సీఎం చంద్రబాబుతో పాటు ఆయన క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.


 
							 
							