Andhra PradeshHome Page Slider

పెద్దిరెడ్డికి చంద్రబాబు మాస్ వార్నింగ్

కుప్పం నియోజకవర్గంలో తన పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. నాడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్ పాదయాత్ర చేస్తే అనుమతిచ్చానన్నారు. నాడు షర్మిల పాదయాత్ర చేసినా, విజయమ్మ కార్యక్రమాలు చేసినా ఎలాంటి ఇబ్బంది కలిగించలేదన్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా పూర్తిగా పోలీస్ వ్యవస్థ సహకరించిందన్నారు. అందువల్లే జగన్ రాష్ట్రమంతా తిరగగలిగారన్నారు. జీవో నెంబర్ 1, తీసుకొచ్చి నాపైనే కుట్రలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత, సొంత నియోజకవర్గంలో ప్రజలతో మాట్లాడకూడదని ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తన విశాఖ, తిరుపతి పర్యటనలను అడ్డుకున్నారన్నారు. రాజధానిలో తన ఇంటిపైనా దాడికి తెగబడ్డారన్నారు. చైతన్యరథం కుప్పం రావడమే తప్పా అంటూ ధ్వజమెత్తారు చంద్రబాబు. సైకోల రాజ్యం కావాలా… ఉన్మాదుల రాజ్యం కావాలా అని ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డికి కలలో కూడా టీడీపీ కన్పిస్తోందని… ఓడిపోతామని భయంతో పేట్రేగిపోతున్నారన్నారు. కొందరు పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తాము కార్యక్రమాలు చేస్తుంటే ఎందుకీ ఆటంకాలు అని ప్రశ్నించారు. చట్టాన్ని అతిక్రమించినవారెవరైనా నేరస్తులే అవుతారన్నారు. పోలీసులే కుట్రపన్ని సమావేశాలను ఫెయిల్ చేయాలని చూస్తున్నారన్నారు. కందుకూరు, గుంటూరు, కుప్పంలో ఒకేలా వ్యవహరించారన్నారు. చైతన్యరథాన్ని అక్రమంగా పోలీసులు తీసుకెళ్లడంపై ఆయన మండిపడ్డారు. ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తారో… అలాంటి పోలీసులపైనా ప్రైవేటు కేసులు పెడతామన్నారు. బోనెక్కిస్తామన్నారు. జగన్ రెడ్డి పనైపోయిందని.. ఇంటికి పోతారని బాబు జోస్యం చెప్పారు.

తాను రాష్ట్రం కోసం పోరాడుతూ.. ప్రజల కోసం పనిచేస్తుంటే…ఈ పద్దతేంటని ఆయన ప్రశ్నించారు. శాడిస్ట్‌కు సహకరిస్తారా లేదో చెప్పాలన్నారు చంద్రబాబు. 45 ఏళ్లలో తనపై కేసు పెట్టాలంటే ప్రభుత్వాలు ఎంతో ఆలోచించేవన్నారు. ఏపీలో ఎమర్జెన్సీ తరహాలో పరిస్థితి కన్పిస్తోందన్నారు. సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలన్నారు. తీవ్రవాదులపై పోరాటం చేశామని, ముఠా నాయకులను అణచివేశామని గుర్తు చేశారు. 10- 20 శాతం మందిపై మాత్రం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. రాచమచంద్రారెడ్డి గుర్తుపెట్టుకో… ఇది బిగినింగ్ మాత్రమే నీ తడాఖా ఏంటో చూస్తా.. తమషా చూస్తున్నావ్… నేను తలచుకుంటే జిల్లాలో తిరిగేవాడవా.. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులతో పోరాడుతున్నానంటూ బాబు మండిపడ్డారు.