రంగంలోకి నేరుగా జగన్, టార్గెట్ కుప్పం
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల ముందు నుంచే ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా నేటి నుంచి కార్యకర్తలతో భేటీ కావాలని జగన్ నిర్ణయించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తలతో జగన్ సమావేశమవుతారు. సాయంత్రం 5.30కు కుప్పం కార్యకర్తలతో.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జి పని తీరు తదితర అంశాలపై కార్యకర్తలతో చర్చిస్తారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు ఎం చేయాలో దిశా నిర్దేశం చేస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పం నుంచి మొదలు పెట్టడం పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే కుప్పం పంచాయితీ, కుప్పం మున్సిపాల్టీలను కైవశం చేసుకున్న వైసీపీ… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అకకడ్నుంచి చంద్రబాబును ఓడించాలని లక్ష్యంగా పెట్టుకొంది. అందులో భాగంగా జగన్ కార్యకర్తల సమావేశంలో తొలిగా కుప్పంపై ఫోకస్ పెట్టారు.