కాంగ్రెస్ పార్టీకి దాసోజు గుడ్‌బై
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ప్రారంభమైన రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా కీలక నేత, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. మొదట్నుంచి పార్టీ కోసం పనిచేస్తుంటే కొందరు కావాలని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో దాసోజు ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. అప్పటి నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలో పనిచేస్తూ కార్యకర్తలతో మమేకమవుతూ వచ్చారు. రాజగోపాల్ రెడ్డి చేరిక అనంతరం దాసోజు కూడా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం.
Read more: తెలంగాణలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు