నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం హిట్టా..?ఫట్టా..?
ఏపీ సీఎం జగన్ తన పాదయాత్రలో మాత్రమే కాకుండా ఎన్నికల మ్యానిఫెస్టోలోను ప్రధానంగా ప్రస్తావించి అమలు చేసిన పథకం పేదలందరికీ ఉచిత ఇళ్ళు. ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలలో ఒక ముఖ్యమైన సంక్షేమ పథకంగా చెప్పుకోవచ్చు. అయితే ఇంత ప్రాధాన్యత ఉన్న పథకంపై తాజాగా సీఎం రివ్యూ నిర్వహించారు. పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం నవరత్నాలలో చాలా ప్రాధాన్యత కలిగినదని తెలిపారు. అందుకే ఈ కార్యక్రమంలో భాగంగా చేసిన పనులకు నిధులు కూడా సక్రమంగా విడుదల చేస్తున్నామన్నారు. అంతే కాకుండా విశాఖలో ఇచ్చిన ఇళ్ళ నిర్మాణ పనులు కూడా వేగంగా జరపాలని అధికారులకు సూచించారు. ఇళ్ళ నిర్మాణంతో పాటు ..కాలనీల్లో సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పనా పనులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటుగా డ్రైనేజీ, కరెంటు, మంచినీళ్ళ వంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలన్నరు.
బీసీలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసేలా వైసీపీ కృషి చేస్తోందన్నారు మోపిదేవి. సీఎం సామాజిక భద్రత, సమతుల్యం పాటిస్తూ రాష్ట్రంలో బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారన్నారు. సీఎం జగన్ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రం కూడా జోక్యం చేసుకొని మ్యాచింగ్ గ్రాంటు ద్వారా భాగస్వామ్యం కావాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో అమలవుతున్న పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతే కాకుండా బీసీ జనగణన జరపాలన్నారు.
అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం జనగణన జరగాలని, చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కోసం మా పార్టీ తరుపున ప్రైవేట్ మెంబర్ బిల్లును విజయసాయి రెడ్డి ఇప్పటికే ప్రవేశ పెట్టారన్నారు.ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలకు,బీసీలకు అగ్రతాంబులం ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా బీసీల అభివృద్ది కోసం కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలన్నారు. అదే విధంగా బీసీలకు వ్యతిరేకంగా ఉన్న క్రిమిలేయర్‌ను ఎత్తి వేయాలన్నారు.