‘ఏపీ ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు దుష్ప్రచారం’-జగన్
ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్ కేటాయించవలసి వస్తుందని చంద్రబాబు నాటకాలు మొదలు పెట్టాడని వైసీపీ నేత జగన్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ” చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమయ్యిందంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. లేని అప్పులు ఉన్నట్లుగా చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అప్పులు రూ.5 లక్షల కోట్లయితే, 14 వేల కోట్ల రూపాయలంటూ పెడుతున్నారు. గవర్నర్ చేత కూడా అబద్దాలు చెప్పించారు. ఆధారం లేని శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. రాష్ట్రం పురోగతి వైపు వెళుతోందా? లేక రివర్స్‌లో వెళుతోందా?. మాకు రూ.4 లక్షల రూపాయల అప్పుతో అధికారం అప్పగించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నాయి. 2024లో టీడీపీ పార్టీ ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి రూ.8 వేల కోట్ల రూపాయలు ఖజానాలో ఉంచాం. ఇప్పుడు కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతున్నారు. ఇది దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. వారి అబద్దాలు బయటపడతాయనే భయంతో అప్పులు ఎక్కువ ఉన్నాయనే వంక పెట్టి ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను పెడుతున్నారు. నిజమైన లెక్కలు చూపించకుండా ప్రజలను మభ్య పెట్టి, మోసం చేస్తున్నారు. మేం ఫ్యాక్ట్ పేపర్లతో గవర్నర్‌కు లేఖ రాస్తాం. చంద్రబాబును మందలించమని గవర్నర్‌ను కోరుతాం.”

